News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 19, 2026

భద్రాద్రి: 40 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

image

భద్రాద్రి జిల్లాలోని నిరుద్యోగులకు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ శుభవార్త చెప్పారు. ఓ ప్రైవేట్ కంపెనీలో 40 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. శనివారం చుంచుపల్లి మండలం బాబు క్యాంప్ ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా ఉంటుందన్నారు. 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండి టెన్త్ ఇంటర్ డిగ్రీ చదివిన వారు అర్హులని స్పష్టం చేశారు. విద్యా అర్హత పత్రాలతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు.

News February 19, 2026

మన సిద్ధిపేటలో రేపే మెగా సెమినార్

image

టెన్త్ తర్వాత విద్యార్థులు వేసే తొలి అడుగుపై పేరెంట్స్ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. మన సిద్ధిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో శుక్రవారం మెగా సెమినార్ జరగనుంది. రేపు సాయంత్రం.6 గంటలకు జరిగే ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. కావున తల్లిదండ్రులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు.

News February 19, 2026

MBNR: అంబేడ్కర్ వర్సిటీ 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ ప్రారంభం

image

మహబూబ్‌నగర్ MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సైన్స్, కంప్యూటర్ విద్యార్థులకు 5వ సెమిస్టర్ ప్రయోగ తరగతులు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. 80% హాజరు ఉన్న విద్యార్థులనే అనుమతిస్తారని ప్రిన్సిపల్ డాక్టర్ కె.పద్మావతి తెలిపారు. మరిన్ని వివరాలకు 73829 29609 నంబరును సంప్రదించాలని రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. సత్యనారాయణ గౌడ్ సూచించారు.