News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 16, 2026
తిరుమల శ్రీవారి దర్శనం కోసం మే నెల దర్శనం కోటా విడుదల

TTD మే–2026 నెలకు సంబంధించిన దర్శనాలు, సేవలు, గదుల కోటాల షెడ్యూల్ ప్రకటించింది.
ఫిబ్రవరి 18 – ఆర్జిత సేవా టికెట్లు విడుదల, 21 – ఇతర సేవలు, వర్చువల్ సేవలు విడుదల, 23 – అంగప్రదక్షిణం, శ్రీవాణి, వృద్ధులు–దివ్యాంగుల దర్శనం, 24 – ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల కోటా, 27 – శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటా టికెట్లు అన్నీ ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
News February 16, 2026
ఆదిలాబాద్ వైస్ ఛైర్మన్‌గా ఎండీ రోహిత్

ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా 44వ వార్డు కౌన్సిలర్ ఎండీ రోహిత్ ఎన్నికయ్యారు. సోమవారం అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు పర్యవేక్షణలో జరిగిన ఎన్నికలో రోహిత్‌కు 27 మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు. ఛైర్‌పర్సన్ ఎన్నిక తరహాలోనే వైస్ ఛైర్మన్ ఎంపికలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్ర సభ్యులు ఆయనకు ఓటు వేశారు. మెజారిటీ సభ్యుల మద్దతు లభించడంతో రోహిత్ ఎన్నికైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.
News February 16, 2026
మద్దూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఢిల్లీ కార్ సరస్వతి!

మద్దూరు మున్సిపాలిటీ నూతన ఛైర్‌పర్సన్‌గా ఢిల్లీ కార్ సరస్వతి జనార్దన్(16వ వార్డు), వైస్ ఛైర్‌పర్సన్‌గా భాగ్యశ్రీ(6వ వార్డు) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. 16 వార్డులకు గాను 9 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు ఆమెకు మద్దతు తెలిపారు. అధికారుల సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం, పట్టణ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆమె ప్రకటించారు.


