News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 7, 2026
మున్సిపల్ ఎన్నికల నగారా.. పటిష్ఠ నిఘా

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కలెక్టర్ అనుదీప్ జిల్లా ఎన్నికల అధికారిగా పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దింపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, పారదర్శకంగా పోలింగ్ జరిగేలా క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
News February 7, 2026
నారాయణపేటలో ‘త్రిముఖ’ పోరు

నారాయణపేట మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. బీజేపీ గెలుపు కోసం కర్ణాటక, మహారాష్ట్రల నుంచి మాజీ మంత్రులు రంగంలోకి దిగగా.. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి బృందం వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తోంది. ఇక బీఆర్ఎస్ బాధ్యతను మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, యాదగిరి రెడ్డి భుజాన వేసుకున్నారు. అగ్రనేతల ప్రచారంతో పేటలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది.
News February 7, 2026
మండల స్థాయిలోనే ప్రజా సమస్యల పరిష్కారం: కలెక్టర్

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం‘ప్రజావాణి’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లా ప్రజలు ఇకపై కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేదన్నారు. సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాల్లోని సమాచార సహాయక కేంద్రం (IFC) ద్వారా డిజిటల్ పద్ధతిలో ఫిర్యాదులను సులభంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలోనే వినతులను పరిష్కరించి ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు.


