News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 18, 2026

జగిత్యాల: ‘కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పాత్ర కీలకం’

image

జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన డైరీ, క్యాలెండర్‌ను జిల్లా వైద్యాధికారి డా. జి. సుజాత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్య, ఆరోగ్యశాఖలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

News February 18, 2026

బంగాళదుంపతో బ్యూటిఫుల్ స్కిన్

image

బంగాళాదుంపలో బ్లీచింగ్ లక్షణాలు పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. దీన్ని ఎలా వాడాలంటే..* బంగాళదుంప రసానికి తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. * బంగాళదుంప రసానికి పెరుగు కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మంపై ఉండే మలినాలను తొలగిస్తుంది.

News February 18, 2026

NZB: ‘భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలి’

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం రద్దు చేయాలని, ప్రభుత్వాలు కార్పొరేట్ యాజమాన్యానికి వత్తాసు పలుకకుండా, అందరికీ ఒకే ఉచిత విద్యా విధానాన్ని రూపొందించాలని కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు అన్నారు. NZBలో బుధవారం ప్రారంభమైన AISF రాష్ట్ర 4 మహాసభల్లో ఆయన మాట్లాడారు. భగత్ సింగ్, చేగువేరా స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలన్నారు.