News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 13, 2026

BREAKING: లక్షెట్టిపేట మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

image

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 15 వార్డులకు గాను 11 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 3 వార్డులు BRS, 1 వార్డు బీజేపీ గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News February 13, 2026

ఖానాపూర్ మున్సిపల్‌లో హంగ్

image

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 12 వార్డులు ఉండగా BRS 4, కాంగ్రెస్ 3, BJP 4, ఇతరులు ఒకటి గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్ 6 ఎవరూ దాటకపోవడంతో హంగ్ నెలకొంది. దీంతో ఖానాపూర్‌లో ఏం జరుగుతుందోనని జిల్లా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

News February 13, 2026

BREAKING: హుస్నాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

image

మంత్రి పొన్నం ఇలాకా హుస్నాబాద్ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 20 వార్డులకు గాను 14 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 2 వార్డులు BRS గెలిచింది. మిగతా వార్డులకు సంబంధించి కౌంటింగ్ జరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.