News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 16, 2026
కృష్ణా: తండ్రికి ఆసరాగా వెళ్తూ.. అనంత లోకాలకు!

తండ్రికి ఆసరాగా ఉండాలనుకున్న ఆ యువకుడిని జలరూపంలో మృత్యువు కబళించింది. పోరంకికి చెందిన డిగ్రీ విద్యార్థి సత్యనారాయణ, ఆదివారం సెలవు కావడంతో తండ్రితో కలిసి కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నదిలో గల్లంతై మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News February 16, 2026
MBNR: మంత్రి శ్రీహరి ఇలాకా.. ఏకగ్రీవ ఎన్నిక

మంత్రి వాకిటి శ్రీహరి నియోజకవర్గమైన మక్తల్‌లోని 3 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. మక్తల్, ఆత్మకూరు, అమరచింత మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లుగా కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక జరిగింది.
✒మక్తల్ ఛైర్ పర్సన్ వాకిటి మానస, వైస్ ఛైర్ పర్సన్ శైవీ రెడ్డి
✒ఆత్మకూరు ఛైర్ పర్సన్ నాగమణి, వైస్ ఛైర్ పర్సన్‌గా శ్రీనివాసులు
✒అమరచింత ఛైర్‌పర్సన్ జింక సువర్ణ, వైస్ ఛైర్‌పర్సన్‌గా రాధ
News February 16, 2026
హస్తం-గులాబీ దోస్తీ: కామారెడ్డి కౌన్సిల్‌లో సరికొత్త సమీకరణం!

కామారెడ్డి మున్సిపాలిటీలో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతులు కలిపాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు స్వతంత్ర కౌన్సిలర్ల ఐక్య మద్దతుతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 12 వ వార్డు కౌన్సిలర్ కాసర్ల గోదావరి వైస్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.


