News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 13, 2026

దేశవ్యాప్తంగా సిట్టింగ్ జడ్జిలపై 8,630 ఫిర్యాదులు

image

గత దశాబ్ద కాలంలో సిట్టింగ్ జడ్జిలపై భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి 8,630 ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం ఇవాళ లోక్‌సభలో వెల్లడించింది. ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2024లో మాజీ CJI చంద్రచూడ్, మాజీ CJI సంజీవ్ ఖన్నా పదవీ కాలంలో ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపింది. పదేళ్ల గణాంకాలు చూస్తే ఎక్కువగా 2022లో 1,012, 2023లో 977, 2024లో 1,170, 2025లో 1,102 ఫిర్యాదులు నమోదయ్యాయంది.

News February 13, 2026

టెన్త్, ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

image

జిలాల్లో టెన్త్, ఇంటర్ పరీక్షలలో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌కి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి విజయానంద్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈనెల 23 నుంచి ఇంటర్, మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షల నిర్వహణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News February 13, 2026

కొత్తగూడెంలో కొత్త కార్పొరేటర్ ‘కిడ్నాప్‌’ కలకలం..!

image

కొత్తగూడెం మేయర్‌ పీఠం దక్కించుకునే క్రమంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 32వ డివిజన్‌ నుంచి BRS తరఫున గెలిచిన కార్పొరేటర్‌ గుగులోత్ రాంబాబును కాంగ్రెస్ నేతలు బలవంతంగా ఎత్తుకెళ్లారని బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనను నిరసిస్తూ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు రాంబాబు ఇంటి వద్ద ధర్నాకు దిగారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.