News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 18, 2026
ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే భూముల్ని వెనక్కి తీసుకోండి: CBN

AP: GOVT ఆమోదించిన ప్రాజెక్టులు త్వరగా ఏర్పాటవ్వాలని సీఎం CBN SIPB భేటీలో అధికారులను ఆదేశించారు. ‘గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, BPCL వంటి మెగా ప్రాజెక్టులు ఏర్పాటు కావాలి. భూముల కేటాయింపులపైన ఇతరులతో మాట్లాడాలి. ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే ఆ భూముల్ని తీసుకోండి. సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలిస్తాం’ అని చెప్పారు. కాగా ₹29,021 కోట్లతో 22,407 ఉద్యోగాలిచ్చే 27 ప్రాజెక్టులను ఆమోదించారు.
News February 18, 2026
మక్తల్‌కు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ఆతిథ్యం

మక్తల్ పట్టణంలో ఈనెల 20 నుంచి 23 వరకు నాలుగు రోజులపాటు సీఎం కప్‌లో భాగంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ వాకిటి మానస హనుమంతు తెలిపారు. బుధవారం మక్తల్ మినీ స్టేడియంలో ఏర్పాట్లను క్రీడాశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి నేతృత్వంలో పరిశీలించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం 66 జట్లు, 1500 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు.
News February 18, 2026
60 రోజుల్లోగా చార్జ్‌షీట్లు దాఖలు చేయాలి: ఎస్పీ

గుంటూరు జిల్లాలో నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలని SP వకుల్ జిందాల్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. 60 నుంచి 90 రోజులలోపు చార్జ్ షీట్లను న్యాయస్థానంలో దాఖలు చేయాలన్నారు. ఆస్తి నేరాల నివారణకు సీసీ కెమెరాల ఏర్పాటు, రాత్రి గస్తీని బలోపేతం చేయాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.


