News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 13, 2026

పెద్దపల్లి జిల్లాలో పార్టీల వారీగా విజేతల వివరాలు..!

image

పెద్దపల్లి జిల్లాలో 124 వార్డు స్థానాలు ఉండగా రామగుండం కార్పొరేషన్ లో ఒక డివిజన్ ఏకగ్రీవమైంది. మిగతా 123 వార్డులకు జరిగిన ఎన్నికలలో పార్టీల వారీగా బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ – 89, BRS – 16, BJP- 3, AIFB- 13, CPI- 1, స్వతంత్ర అభ్యర్థులు- 2 స్థానాలలో విజయం సాధించారు.

News February 13, 2026

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ ముందంజ

image

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. మొత్తం 60 స్థానాలకు గాను 30 డివిజన్లకు లెక్కింపు పూర్తయింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో, బీఆర్ఎస్ 9 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఎంఐఎం 1, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ స్పష్టమైన అధిక్యంలో కొనసాగుతుంది.

News February 13, 2026

మెట్‌పల్లి: మూడవ రౌండ్‌లో విజయం సాధించిన అభ్యర్థులు వీరే

image

మెట్‌పల్లి మున్సిపాలిటీ వార్డుల్లో 3వ రౌండ్ విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు ఇవే. 3వ వార్డు బత్తుల నరేశ్ కాంగ్రెస్, 6వ వార్డు బంగారుకాళ్ల నీరజ బీఆర్ఎస్, 9వ వార్డు బొడ్ల వసుధ బీజేపీ, 12వ వార్డు సుమయ్య తబస్సుం ఇండిపెండెంట్, 15వ వార్డు అరిగేలా అనూష బీజేపీ, 18వ వార్డు చెట్లపెల్లి మీనా, 21వ వార్డు ఖాజా అజీమ్ వొద్దిన్ ఇండిపెండెంట్ 24వ పూదరి జ్యోతి బీఆర్ఎస్ విజయం సాధించారు.