News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 9, 2026

గుంటూరు: యువతి అదిరిపోయే స్కెచ్.. రూ.60 లక్షలు గోవిందా.!

image

ఆన్‌లైన్ మోసగాళ్ల వలలో పడి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భారీగా నష్టపోయారు. పాతగుంటూరుకు చెందిన శ్రీనివాసరావుకు ఓ యువతి పరిచయమై, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ ఆశ చూపింది. ఆమె మాటలు నమ్మి విడతలవారీగా రూ.60 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత యువతి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 9, 2026

US సైనిక మోహరింపులకు భయపడం: ఇరాన్

image

అమెరికాతో <<19053726>>చర్చల్లో<<>> యురేనియం శుద్ధి విషయంలో వెనక్కి తగ్గబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమను ఆదేశించే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. <<19009250>>సైనిక మోహరింపు<<>>లతో అమెరికా తమను భయపెట్టలేదని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ అన్నారు. ‘మాకు USపై పెద్దగా నమ్మకం లేదు. ఆ దేశంతో చర్చల గురించి మా వ్యూహాత్మక భాగస్వాములైన చైనా, రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని తెలిపారు.

News February 9, 2026

పోలవరం జిల్లా సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావన వస్తుందా?

image

ఈ నెల 11వ తేదీ నుంచి AP అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. పోలవరం నష్ట పరిహారం R&R ఇంకా చాలామందికి జమ కాలేదు. పోలవరం జిల్లా ఏర్పడినా.. ఇంకా చాలా శాఖలకు అధికారుల నియామకం జరగలేదు. ఈ సమస్యలపై రంపచోడవరం MLA శిరీష దేవి అసెంబ్లీలో ప్రస్తావించాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ హాస్టల్స్‌లో సమస్యలు, పర్యాటక అభివృద్ధికి చర్యలు గురించి అసెంబ్లీలో మాట్లాడాలని కోరుతున్నారు.