News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రం శుక్రవారం భక్తులతో కిక్కిరిసింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల యాత్రికులు భారీగా తరలివస్తున్నారు. శివరాత్రి జాగారం చేసేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. నేడు స్వామి అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. క్షేత్రమంతా శివనామస్మరణతో మారుమోగుతోంది.
News February 13, 2026
వరంగల్: ఎన్నికల కవరేజీ బిల్లులేవీ సారూ..?

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ప్రక్రియను ఎన్నికల సంఘం వీడియో కవరేజ్ చేయించింది. నామినేషన్ల స్వీకరణ, అభ్యర్థుల ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ తదితరాలను కవరేజ్ చేయించిన అధికారులు వీడియో గ్రాఫర్లకు బిల్లులు ఇవ్వడంలో తాత్సారం వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 317 గ్రామ పంచాయతీల్లో కవరేజ్ చేసిన వీడియో గ్రాఫర్లు బిల్లులు అడిగితే అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News February 13, 2026
గ్రూప్-1 వివాదం: జాబితాలో రేపల్లె RDO రామలక్ష్మి

2018 గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై హైకోర్టు SIT విచారణకు ఆదేశించింది. జవాబు పత్రాల ట్యాంపరింగ్ ఆరోపణపై అదనపు DG నేతృత్వంలో విచారణ జరపాలని పేర్కొంది. ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికారులను తక్షణమే నాన్-ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అధికారుల జాబితాలో రేపల్లె RDO రామలక్ష్మి ఉన్నారు. కోర్టు ఈ నెల 11న తాజా ఆదేశాలతో ఆమెను ప్రాధాన్యత లేని పోస్ట్‌కు బదిలీ చేయనుంది.


