News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 19, 2026

శ్రీకాకుళంలో ఎండలు, ఉక్కబోత ప్రారంభం

image

శ్రీకాకుళం జిల్లాలో గత రెండు రోజులుగా ఎండలు, ఉక్కబోత పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మహాశివరాత్రి తర్వాత రోజుల నుంచి వేడి తీవ్రత మొదలవుతుందని చెబుతున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత గణనీయంగా పెరుగుతుంది. వాతావరణ నిపుణుల ప్రకారం, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

News February 19, 2026

ASF జిల్లాలో 23 పరీక్షా కేంద్రాలు: డీసీవో

image

సాంఘిక సంక్షేమ, జనరల్ గురుకులాల్లో 5 తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఈనెల 22న పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయ అధికారి శారద తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,847 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఆన్‌లైన్లో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందన్నారు.

News February 19, 2026

ఇండియాలోనూ ఇలాంటి మార్పులు కావాలా?

image

ఇండియాలోనూ జపాన్ తరహా మార్పులు రావాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దగ్గర పిల్లలు ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్‌కు అలవాటు పడ్డారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం వంటి ముప్పుకు దారితీస్తోందని హెచ్చరిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు జపాన్‌లోని పాఠశాల క్యాంటీన్లలో ప్రాసెస్డ్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను నిషేధించినట్లు తెలిపారు. దీనిపై మీ కామెంట్?