News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 18, 2026

‘అమ్మను బాగా చూసుకో’.. సోనూసూద్ ఉదారత!

image

గత రెండేళ్లుగా మంచానికే పరిమితమైన తన తల్లి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోందని, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కొనే శక్తి లేదని ఓ నెటిజన్ చేసిన విన్నపానికి నటుడు సోనూసూద్ స్పందించారు. ఆక్సిజన్ యంత్రాన్ని నేరుగా వారి ఇంటికే పంపించి తన ఉదారతను చాటుకున్నారు. ‘తల్లిని బాగా చూసుకో’ అని ఆ యువతికి ధైర్యం చెప్పారు. కరోనా కష్టకాలం నుంచి సోనూసూద్ నిరంతరం సామాన్యులకు అండగా నిలుస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు.

News February 18, 2026

ADB: వచ్చే నెల పెళ్లి.. యాక్సిడెంట్‌లో మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. దన్నూర్ (బి) గ్రామానికి చెందిన దోపతి సురేందర్(30) బుధవారం బైక్‌పై వెళుతుండగా వేంకటేశ్వర ఆలయ సమీపంలో ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొంది. 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి మార్చి 9న వివాహం జరగాల్సి ఉంది. సురేందర్ మరణించడంతో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

News February 18, 2026

‘AP అసెంబ్లీకి ముంబయి నుంచి టెక్నీషియన్లు’

image

ఏపీ అసెంబ్లీలో తలెత్తిన మైక్స్ రిపేర్స్ కోసం ముంబయి నుంచి టెక్నీషియన్లు రానున్నట్లు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు. లాబీలో ఆయన మాట్లాడుతూ రెండు మూడురోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందన్నారు రెండు రోజులుగా అసెంబ్లీ లో సభ్యులు మాట్లాడే మైక్స్ మూగబోయిన సంగతి తెలిసిందే. నిన్న కొంతమేర పనిచేసినా ఇవాళ మాత్రం అసలు పనిచేయలేదు. దానికి ప్రత్యాన్మయంగా స్టాండ్ మైక్ లను ఉంచి సభ నడిపించారు.