News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 11, 2026
ఆకాశంలో అద్భుతం.. ‘హృదయ’ కాంతిని చూడండి!

ప్రేమికుల రోజుకు ముందు ఆకాశంలో అద్భుతం జరిగింది. హృదయపు ఆకారంలో ఏర్పడిన నార్తర్న్ లైట్స్ కనువిందు చేస్తున్నాయి. వినీల ఆకాశంలో ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తున్న ‘హార్ట్’ను నార్వేలో క్రిస్టొఫర్ వెంజెన్ బంధించారు. శీతాకాలంలో ఆర్కిటిక్ సమీపంలో ఈ నార్తర్న్ లైట్స్ కనిపిస్తాయి. సూర్యుడి నుంచి వెలువడే ఛార్జ్‌డ్ కణాలు ఆక్సిజన్, నైట్రోజన్‌తో ఢీకొన్నప్పుడు ఆకుపచ్చ, పింక్, ఎరుపు, నీలం రంగు కాంతులను వెదజల్లుతాయి.
News February 11, 2026
13న ఆర్టీఏ సేవలకు అంతరాయం: డీటీఓ జగదీష్

హైదరాబాద్‌లో నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమం కారణంగా ఈనెల 13న జిల్లాలో వాహన రవాణా శాఖ సేవలకు అంతరాయం కలగనుంది. వైరా కార్యాలయ సిబ్బంది శిక్షణకు హాజరవుతుండటంతో అక్కడ సేవలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి (DTO) ధర్మపురి జగదీష్ తెలిపారు. ఖమ్మం, సత్తుపల్లి కార్యాలయాల్లో సేవలు పాక్షికంగానే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు, ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.
News February 11, 2026
అనకాపల్లి: టెన్త్ విద్యార్థులు రేపే లాస్ట్ ఛాన్స్

ఏపీలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. అనకాపల్లి జిల్లాలో మొత్తం 20,575 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారని DEO అప్పారావు నాయుడు తెలిపారు. వీరి కోసం 102 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో టెన్త్ మార్కుల లిస్ట్ అన్నింటికి కీలకం కావడంతో అందులో తప్పులుంటే ఇబ్బందులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. వివరాల్లో తప్పులు ఉంటే FEB-12 లోగా HMలను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు.


