News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 10, 2026
NZB: రేపు టీయూ పరిధిలోని కళాశాలలకు సెలవు!

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలకు రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి సాధారణ సెలవు ప్రకటించారు. రేపు జరగనున్న పోలింగ్‌లో బోధన, బోధనేతర సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మెయిన్ క్యాంపస్, సౌత్ క్యాంపస్ (భిక్కనూర్), సారంగాపూర్ క్యాంపస్‌లకు సెలవు ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ అందరికి వర్తిస్తుందన్నారు.
News February 10, 2026
రైతులకు వాట్సాప్‌లో APMIP సేవలు

AP: వాట్సాప్(మన మిత్ర)లో ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు(APMIP)ను ఏర్పాటు చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ‘రైతులు ఫోన్‌తో 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో Hi అని పంపి, APMIPను ఎంపిక చేసుకోవాలి. సబ్సిడీ కోసం నమోదు, దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడం వంటి సేవలను ఇంటి నుంచే పొందవచ్చు. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు ఆన్‌లైన్‌లో కొని సురక్షితంగా చెల్లింపులు చేయొచ్చు’ అని తెలిపారు.
News February 10, 2026
తగ్గిన మేడారం ఆదాయం @2026 రూ.12.64 కోట్లు!

మేడారం సమ్మక్క-సారలమ్మ హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. గత వారం రోజులుగా 828 హుండీలను లెక్కించగా రూ.12,64,67,051 ఆదాయం వచ్చింది. మొత్తం 828 హుండీలను ఏర్పాటు చేయగా, అన్ని హుండీలను లెక్కించారు. ప్రస్తుతానికి బంగారు, వెండి అభరణాల లెక్కింపు మాత్రమే మిగిలింది. గత జాతరలో రూ.13.25 కోట్లు ఆదాయం రాగా, ఈ 2026 జాతరలో రూ.12.64 కోట్ల ఆదాయం వచ్చింది.


