News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 12, 2026
సిద్దిపేట: సాగునీటి విడుదలపై హరీశ్ రావు సమీక్ష

మల్లన్న సాగర్ నీటి విడుదల, సాగునీటి ప్రాజెక్టుల పనులపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రంగనాయక సాగర్ కుడి కాలువలో పేరుకుపోయిన తుంగ గడ్డిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. చంద్రపూర్ లిఫ్ట్ పనులను వేగవంతం చేసి మూడు నెలల్లో ప్రారంభించాలని సూచించారు. సాగునీటి కోసం రైతులు ఆందోళన చెందుతున్నారని, మల్లన్న సాగర్ నుండి తక్షణమే నీటిని విడుదల చేయాలని కోరారు.
News February 12, 2026
పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలి: సీతక్క

గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం రూ.387 కోట్లు విడుదల చేసింది. మొదటి విడతగా ఇప్పటికే రూ.259.36 కోట్లు ఇచ్చింది. తాజా విడతతో కలిపి మొత్తం రూ.646.36 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణకు ఇంకా సుమారు రూ.3,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికలు పూర్తి చేసి కేంద్రానికి సమాచారం అందించామని, మిగిలిన నిధులు వెంటనే విడుదల చేయాలని మంత్రి సీతక్క కేంద్రాన్ని కోరారు.
News February 12, 2026
ఓటుతో సామాజిక మార్పు.. ట్రాన్స్‌జెండర్ల పౌర చైతన్యం

ఖమ్మం జిల్లాలోని 5మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్లు ఉత్సాహంగా పాల్గొని పౌర బాధ్యత చాటారు. జిల్లాలో మొత్తం 24 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉండగా, వారిలో 17 మంది (దాదాపు 71%) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సత్తుపల్లిలో 11 మంది, మధిరలో ముగ్గురు, ఎదులాపురంలో ఇద్దరు, వైరాలో ఒకరు చొప్పున ఓటు వేశారు. సామాజిక గుర్తింపు, మార్పు కోసమే తాము ఓటు వేసినట్లు వారు పేర్కొన్నారు.


