News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 13, 2026

BREAKING: తూప్రాన్‌ మున్సిపల్ పీఠం BRSదే

image

కేసీఆర్ ఇలాకా గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీ పీఠంలో BRS గెలిచింది. ఇక్కడ 16 వార్డులకు గాను 9 వార్డులు BRS సాధించింది. 4 వార్డులు కాంగ్రెస్, 3 వార్డులు బీజేపీ గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో BRS పీఠం దక్కించుకుంది. దీంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News February 13, 2026

అలంపూర్ మున్సిపాలిటీ 10 వార్డుల కౌన్సిలర్లు వీరే!

image

1వ వార్డ్ కౌన్సిలర్ గా (INC) స్వాతి
2 వ వార్డ్ కౌన్సిలర్ గా (INC) రాజ్యలక్ష్మి
3వ వార్డ్ కౌన్సిలర్ గా (BRS) ఆసిఫ్ ఖాన్
4వ వార్డ్ కౌన్సిలర్ గా (INC) ఈరమ్మ
5వ వార్డ్ కౌన్సిలర్ గా (INC) జమ్మన్న
6వ వార్డ్ కౌన్సిలర్ గా (BRS) జయరాములు,
7వ వార్డు కౌన్సిలర్ గా (BRS) మోహన్ రెడ్డి
8వ వార్డ్ కౌన్సిలర్ గా (INC)పద్మావతి
9వ వార్డ్ కౌన్సిలర్ గా (BRS) మాధురి
10 వ వార్డ్ కౌన్సిలర్ గా (BRS) విక్రమ్ గెలుపొందారు.

News February 13, 2026

కొత్తగూడెంలో ‘హంగ్‌’?.. ఉత్కంఠగా రిజల్ట్స్

image

కొత్తగూడెం కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. వెలువడిన ఫలితాల ప్రకారం ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కకపోవడంతో కార్పొరేషన్‌ ‘హంగ్‌’ దిశగా పయనిస్తోంది. మొత్తం స్థానాల్లో సీపీఐ 18 డివిజన్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్‌ 12 స్థానాలను కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్‌ 2, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్స్ 3 స్థానాల్లో విజయం సాధించారు.