News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 17, 2026

సంగారెడ్డి: ‘మీ నిర్ణయమే పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది’

image

పదో తరగతి తర్వాత విద్యార్థులు వేసే తొలి అడుగుపై తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, ఆ నిర్ణయమే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుందని CBI EX జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. సంగారెడ్డిలోని శివాజీనగర్ YMR గార్డెన్స్‌లో మంగళవారం Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహించగా ఆయన ప్రారంభించి, విలువైన సూచనలు చేశారు. ఈకార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.

News February 17, 2026

పెద్దపల్లి: రైతులకు ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు: కలెక్టర్

image

రైతులకు ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులతో జరిగిన సమీక్షలో ఆదేశించారు. అవసరమైన మేరకు యూరియా అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతు బీమా రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేసుకునేలా చూడాలని చూడాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

News February 17, 2026

సిద్దిపేట జిల్లా దాటిన పెద్దపులి.., కానీ

image

కొద్ది రోజులుగా సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో పెద్దపులి సంచరిస్తూ పశువులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. ఆరు రోజుల క్రితం చిన్నకోడూర్, బెజ్జంకి సరిహద్దు గుట్టల్లో ప్రవేశించిన పెద్దపులి అక్కడి నుంచి వెళ్లి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పశువులపై దాడి చేసింది. పులి జిల్లా దాటడంతో భయాందోళనలో ఉన్న జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.