News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 12, 2026

ఆదిలాబాద్: బ్యాలెట్ బాక్స్‌లోనే భవితవ్యం

image

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. పోలింగ్ ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకోగా, అభ్యర్థుల్లో మాత్రం ఉత్కంఠ పెరిగింది. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా, ఓటింగ్ సరళిపై స్పష్టమైన అంచనాకు రాలేక లోలోన ఆందోళన చెందుతున్నారు. అందరి దృష్టి ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులపైనే ఉంది.

News February 12, 2026

టెన్త్ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా ప్రైవేటు టీచర్లు!

image

AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ పలు మార్పులు చేసింది. ఇప్పటిదాకా ప్రభుత్వ ఉపాధ్యాయులే ఇన్విజిలేషన్ చేస్తుండగా, ఇకపై ప్రైవేటు టీచర్లకూ అవకాశం ఇవ్వనుంది. ఈ ఏడాది నుంచి 25% మంది ప్రైవేటు టీచర్లను తీసుకోనుంది. ఆన్‌లైన్ విధానంలో ఇన్విజిలేషన్ బాధ్యతలు కేటాయించనుంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 4 నుంచి 10 రోజులు జవాబు పత్రాల మూల్యాంకనం జరగనుంది.

News February 12, 2026

18 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు

image

NLR: డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ విభాగాల్లో లోయర్, హయ్యర్ గ్రేడ్లకు సంబంధించిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలను ఈనెల 18 నుంచి 21 వరకు నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు ఓ ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లను www.bse.ap.gov.inలో అందుబాటులో ఉంచామన్నారు. హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డును తప్పక తీసుకు రావాలని కోరారు.