News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 12, 2026

శ్రీశైలంలో పోలీసుల తీరుపై సీఎం అసంతృప్తి

image

శ్రీశైలంలో భక్తుల రద్దీని నియంత్రించడంలో పోలీసుల తీరుపై CM చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై హోంమంత్రి అనిత వివరణ ఇస్తూ.. క్యూలైన్లలో ఊపిరాడక ఇబ్బంది పడుతున్న వృద్ధులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నించారని తెలిపారు. అయితే, వారిని దర్శనానికి తీసుకెళ్తున్నారనే అపోహతో భక్తులు ఆందోళన చేశారని వివరించారు. ఈ పరిస్థితిని భక్తులకు మైకుల ద్వారా ముందే వివరించి ఉంటే బాగుండేదని సీఎం అభిప్రాయపడ్డారు.

News February 12, 2026

శివ నామాలు అర్థాలు ‘‘గంగాధర’’

image

భగీరథుడు తన పితృదేవతల మోక్షం కోసం గంగను భూమికి తీసుకురావాలని తపస్సు చేశాడు. గంగ ఆకాశం నుంచి నేరుగా భూమి మీద పడితే ఆ వేగానికి భూలోకం తట్టుకోలేదని శివుడు గ్రహించాడు. గంగమ్మను తన జటాజూటంలో బంధించాడు. తన జుట్టు నుంచి ఓ పాయను బయటకి తీసి, దాని ద్వారా గంగను భూమిపైకి నెమ్మదిగా వదిలాడు. అల్లకల్లోలమైన గంగను శాంతింపజేసి తన తలపై ధరించిన వాడు కాబట్టే ఆయన ‘గంగాధరుడు’ అయ్యాడు. ఇది ఆయన లోకహితైషితకు నిదర్శనం.

News February 12, 2026

జీడిమామిడిలో ఆకు, పూత, కాయమచ్చ తెగులు నివారణ

image

ఈ తెగులు వల్ల ఆకులపై లేత ఆకుపచ్చ రంగులో మచ్చలు ఏర్పడి అవి పెరుగుతూ మచ్చ మధ్య ఎండిపోయి చివరికి మొత్తం ఆకు ఎండి రాలిపోతుంది. పూత, పూత కాడలపై మచ్చలు వచ్చి పూత ఎండిపోయి రాలిపోతుంది. ఈ మచ్చ తెగులు నివారణకు రైతులు తొలుత తెగులు ఆశించిన కొమ్మలను పూర్తిగా తొలగించాలి. లీటరు నీటికి మాంకోజెబ్ 1 గ్రాము లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 1ml కలిపి పిచికారీ చేసుకోవాలి.