News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 12, 2026
మామిడి పిందెలేర్పడే దశలో చీడల నివారణ

మామిడిలో చిన్న పిందెలేర్పడే దశలో తామర, పిండి పురుగులు, మచ్చ, బూడిద తెగులు ఆశించి పంటను నష్టపరుస్తాయి. ఈ దశలో పిందె రాలుడు సమస్య కూడా ఉంటుంది. వీటి నివారణకు పిందె కట్టే దశలో లీటరు నీటికి పిప్రోనిల్ 2ML లేదా లాన్సర్ గోల్డ్ 2గ్రా. లేదా రోగార్ 2ML మందులతో పాటు హెక్సాకొనజోల్ 2ML లేదా క్లోరోథలోనిల్ 2గ్రా మందును మరియు 4.5 లీటర్ల నీటికి ప్లానోపిక్స్ అనే హార్మోను మందును 1ML కలిపి పిచికారీ చేయాలి.
News February 12, 2026
ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారా?

ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా కామెంట్ చేయండి.
News February 12, 2026
రైతులను ఇబ్బంది పెడితే వేటే.. అధికారులకు జేసీ వార్నింగ్!

అప్సడ (APSADA) రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో రైతులను ఇబ్బంది పెట్టినా, అవినీతికి పాల్పడినా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. అధికారులతో నిర్వహించిన గూగుల్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. రైతులను అనవసరంగా వీఆర్వోల వద్దకు పంపవద్దని ఆదేశించారు. విధి నిర్వహణలో పారదర్శకత ఉండాలని, రైతుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


