News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 17, 2026

సీతానగరం: అమాంతం పడిపోయిన టమోటా ధర!

image

టమోటా ధర పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొద్ది రోజులు కిందట వరకు కిలో రూ.50 వరకు పలికిన ధర.. ప్రస్తుతం రూ.6 నుంచి రూ.8 పలుకుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సీతానగరం మండలం చినబోగిలి కూడలికి రైతులు సరుకు తెచ్చి అమ్ముతున్నారు. 25 కేజీలు ఉన్న కేటు రూ.200 నుండి రూ.250కు వ్యాపారస్తులు కొంటున్నారని, పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.

News February 17, 2026

సంగారెడ్డి: నిరుద్యోగులకు ఉచిత సెల్ ఫోన్ శిక్షణ

image

సంగారెడ్డి, మెదక్ జిల్లాల గ్రామీణ యువతకు SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(RSETI) ఉచితంగా సెల్ ఫోన్ సర్వీసింగ్ శిక్షణ ఇస్తోంది. 19 నుంచి 45 ఏళ్ల వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను 94901 03390, 94901 29839 నంబర్లకు వాట్సాప్ చేయాలని డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 17, 2026

BIG BREAKING: కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్‌కు BJP మద్దతు.. ఛై‌ర్‌పర్సన్ ఎన్నిక

image

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో ఛై‌ర్‌పర్సన్, వైస్ ఛై‌ర్‌పర్సన్ ఎన్నికలు ముగిశాయి. 18వ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ సహిన్ సుల్తానా BJP మద్దతుతో మున్సిపల్ ఛై‌ర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అలాగే వైస్ ఛై‌ర్‌పర్సన్‌ ఎన్నికకు 29వ వార్డు బీజేపీ కౌన్సిలర్ కొత్తపల్లి అనితకు, 8వ వార్డు బీజేపీ కౌన్సిలర్ గజ్జల లావణ్యకు మధ్య టై ఏర్పడగా లక్కీడ్రా పద్ధతి ద్వారా అనిత వైస్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.