News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 12, 2026

ఆన్‌లైన్‌లో వేప పుల్లలు.. రూ.2వేల పైనే!

image

మన దగ్గర ఉచితంగా లభించే ఎన్నో ప్రొడక్ట్స్‌ను ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తుంటాం. అందులో ‘వేప పుల్ల’ ఒకటి. అమెజాన్ వంటి షాపింగ్ సైట్స్‌లో 20 పుల్లలకు రూ.160వరకు ఉంటోంది. అదే అమెరికా వంటి దేశాల్లో వీటిని రూ.2వేల వరకూ విక్రయిస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన జీవనశైలిలో భాగంగా చాలామంది వేపపుల్ల వైపు మళ్లుతున్నారట. వేపలోని సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్ గుణాలు చిగుళ్లను దృఢపరుస్తాయి.

News February 12, 2026

44 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

UPSC 44 ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BSc (స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్), MA, MSc అర్హత గలవారు మార్చి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://upsconline.nic.in

News February 12, 2026

శాస్త్రవేత్తలతో కలెక్టర్ మహేశ్ కుమార్ భేటీ

image

క్వాయర్ పరిశ్రమల ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండా ఎగుమతులను పెంచవచ్చని కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్‌లో కేరళ కొచ్చి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో క్వాయర్ ఆధారిత ఉత్పత్తుల తయారీ, నూతన సాంకేతికత వినియోగంపై చర్చించారు. కోనసీమ కొబ్బరి ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా పరిశ్రమల స్థాపనకు సహకరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.