News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 17, 2026
కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఉప్పల్‌వాయి యువకుడు మృతి

రామారెడ్డి మండలం ఉప్పల్‌వాయి గ్రామానికి చెందిన జంగిటి రాజు మంగళవారం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పని నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా వెన్నెల డిబేట్ సమీపంలో బైక్‌ను కారు ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News February 17, 2026
నిజామాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు కమిషనరేట్ పరిధిలో 58 పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు ఉంటాయన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని, కేంద్రాల వద్ద జనం గుమిగూడడం నిషేధమని, 200 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.
News February 17, 2026
BREAKING: హైదరాబాదీలకు ఇందిరమ్మ ఇళ్లు

కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(CURE) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక మార్చి నెలాఖరుకల్లా పూర్తిచేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ‘మురికివాడల్లో 5-10 అంతస్తుల్లో ఇళ్లు నిర్మిస్తాం. KPHB లాగా RRR- ORR మధ్య మిడిల్ క్లాస్ వారికి ఇళ్ల స్థలాల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్‌లకు నిధులు మంజూరు చేస్తాం. సొంత స్థలం ఉన్న 28వేల మందికి ఈ నెలలో ఇళ్లు మంజూరు చేస్తాం’ అని అన్నారు.


