News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 9, 2026
ఖమ్మం: సాయంత్రం 5 గంటల తరువాత ష్.. గప్ చుప్

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో గత కొద్దిరోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. అభ్యర్థుల్లో గెలుపు గుర్రాలు ఎవరో తేల్చే సమయం ఆసన్నమవడంతో, ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. సాయంత్రం 5 గంటలకు మైకులు మూతపడనుండటంతో, అభ్యర్థులు ‘రోడ్ షో’లు, ఇంటింటి ప్రచారంతో మున్సిపాలిటీలను చుట్టేయనున్నారు. బుధవారం పోలింగ్ జరగనుంది.
News February 9, 2026
KNR: నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సాగుతున్న ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నెల 11న జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48గంటల ముందు ప్రచారం నిలిపివేయనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత బహిరంగ సభలు, ప్రచార వాహనాలు పూర్తిగా నిషేధించబడతాయి. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా వైన్ షాపులు కూడా పోలింగ్ ముగిసే వరకు మూసివేయనున్నారు. ఇక పట్టణ భవిష్యత్తును ఓటర్లు 11న తేల్చనున్నారు.
News February 9, 2026
KNR: మున్సిపల్ కురుక్షేత్రం.. గెలిచేదెవరో.. నిలిచేదెవరో

మున్సిపల్ సమరం ముగింపు దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లాలోని మేయర్, పురపాలక పీఠాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్యాన్ని చాటుకున్న హస్తం పార్టీ, మున్సిపల్ ఎన్నికోల్లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. ఎన్నికల్లో గెలిచి రాజకీయంగా నిలవాలని నాయకులు పాటుపడుతున్నారు.


