News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 19, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

* పెనమలూరులో ఈనెల 21న జాబ్ మేళా
* మచిలీపట్నంలో రైల్వే జాబ్ స్కామ్
* కృష్ణా: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష
* విజయవాడలో డివైడర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్సు
* బందర్‌లో బెల్ట్ దందా
* గుడివాడ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
* గూడూరులో కొడుకు పై పేకాట కేసు.. తండ్రి ఆత్మహత్యాయత్నం
News February 19, 2026
కీసరగుట్ట బోర్డు పదవీకాలం ఏడాదే: హైకోర్టు

కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు గడువు పొడిగింపుపై TG హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ట్రస్టు బోర్డు పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన GO సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. TG చారిటబుల్ & హిందూ రిలీజియస్ ఇనిస్టిట్యూషన్స్& ఎండోమెంట్స్ చట్టం 1987లోని సెక్షన్ 17(2) ప్రకారం.. ట్రస్ట్ బోర్డు పదవీకాలం ఏడాది మాత్రమేనని స్పష్టం చేశారు.
News February 18, 2026
సంగారెడ్డి: ‘శివాజీ జయంతి శాంతియుతంగా నిర్వహించాలి’

ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ర్యాలీలు నిర్వహించేందుకు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. సూచించిన మార్గాల్లోనే ర్యాలీ నిర్వహించాలని, రహదారులు దిగ్బంధం చేయకుండా, ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా సమయపాలన పాటిస్తూ జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.


