News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 18, 2026

అశ్వ వాహనంపై ఆదిదంపతులు

image

శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఉత్సవాల చివరి రోజున శివపార్వతులు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రికి పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవ కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా ముగియనున్నాయి.

News February 18, 2026

రంజాన్ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మసీదులు, ఈద్గాల వద్ద పారిశుద్ధ్యం , నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు.

News February 18, 2026

వేసవి కార్యాచరణ సిద్ధం చేయాలి: కామారెడ్డి కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’ సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.