News April 25, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 14, 2026

తిరుపతి: కళ్లలో కారం కొట్టి బంగారం దోపిడి

image

సూళ్లూరుపేట కచేరి వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గోల్డ్ షాపులో శనివారం మధ్యాహ్నం దోపిడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల మేరకు.. కొనుగోలు చేస్తున్నట్లు నటించిన ఓ దుండగుడు షాపు యజమాని కళ్లలో కారం పొడి చల్లి సుమారు ₹30 లక్షల విలువైన 916 హాల్‌మార్క్ బంగారు నగలను అపహరించుకుని పరారయ్యాడు. ఘటనతో ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 14, 2026

NLG జిల్లావ్యాప్తంగా 37 మంది గైర్హాజరు

image

జిల్లా వ్యాప్తంగా 106 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి తెలుగు పరీక్ష సుజావుగా జరిగినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. 19,672 మంది విద్యార్థులకు గాను, 19,635 మంది విద్యార్థులు హాజరై 37 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. వీరిలో ముగ్గురు ప్రైవేటు విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. కలెక్టర్ బి. చంద్రశేఖర్ నాలుగు సెంటర్లను తనిఖీ చేశారని చెప్పారు.

News March 14, 2026

ANU దూరవిద్య ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సర్వసిద్ధం

image

ANU దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 15న జరిగే MBA, MCA ప్రవేశ పరీక్షకు సర్వం సిద్ధం చేసినట్లు CDE డైరెక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆన్‌లైన్లో దరఖాస్తులను ఆదివారం మధ్యాహ్నం 12గంటల లోపు పూర్తి చేసి పత్రాలను పరీక్ష కేంద్రంలో చూపించాలన్నారు. దరఖాస్తులు అందించని అభ్యర్థులు నేరుగా ఆధార్ కార్డు, అభ్యర్థి ఫోటో తోపాటు రూ.500 తత్కాల్ ఫీజు చెల్లించి పరీక్ష కేంద్రాలలో నేరుగా హాజరు కావచ్చన్నారు.