News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 13, 2026

జెన్ జీ లవ్ స్టోరీల్లో ‘ఆరెంజ్’ ఫ్లేవర్!

image

నేటి సోషల్ మీడియా యుగంలో ప్రేమలు ‘ఇన్‌స్టంట్’ అయిపోయాయి. జెన్ జీల పోకడతో బంధాలు కలకాలం ఉండటం కలగా మారుతోంది. ప్రతి వాలంటైన్స్ డేకి ఓ కొత్త జంట పుట్టుకొస్తోంది. కానీ ఆ ప్రేమ మొక్కగా ఎదిగేలోపే మనస్పర్ధల తుఫానుకు రాలిపోతోంది. ‘ప్రేమ అంటే కొన్నాళ్లే బాగుంటుంది’ అనే ‘ఆరెంజ్’ సినిమా సిద్ధాంతాన్ని చాలామంది ఫాలో అవుతున్నారు. ఈ ‘షార్ట్ టర్మ్’ రిలేషన్‌షిప్ వల్ల పాతకాలపు శాశ్వత అనుబంధాలు కనుమరుగవుతున్నాయి.

News February 13, 2026

కొత్తగూడెం మేయర్ పీఠం దక్కేదెవరికో..?

image

కొత్తగూడెం కార్పొరేషన్‌లో మేయర్‌ పీఠం దక్కించుకోవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నేడు విడుదలైన 60 డివిజన్ల ఫలితాల్లో CPI 22 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ 22, BRS 8, BJP 1, CPM 1 స్థానాల్లో విజయం సాధించగా.. ఆరుగురు స్వతంత్రులు గెలుపొందారు. మేయర్‌ గిరీకి అవసరమైన 31 మంది బలం ఏ పార్టీకీ రాకపోవడంతో ‘హంగ్‌’ అనివార్యమైంది. ఈ క్రమంలో BRS, స్వతంత్రుల మద్దతు కీలకం కానుంది.

News February 13, 2026

మన నెల్లూరు కలెక్టర్ లవ్ స్టోరీ తెలుసా..?

image

మన నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా ముస్సోరీలో శిక్షణలో ఉండగా 2013లో కృతికా(పల్నాడు కలెక్టర్) పరిచయమయ్యారు. ప్రాంతాలు వేరైనా ఇద్దరి అభిరుచులు ఒకటే కావడంతో పరస్పరం ఇష్టపడ్డారు. తమ కెరీర్‌కు ప్రాధాన్యమిస్తూనే ముందుకు సాగారు. తల్లిదండ్రులను ఒప్పించి 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి రియాన్ష్(8), పాప అహిల్యా(18 నెలలు) ఉన్నారు. లవర్స్ డే నేపథ్యంలో తమ ప్రేమ బంధాన్ని ఆయన Way2Newsకు వివరించారు.