News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 12, 2026
తాగునీటి సమస్యనా? ఫోన్ చేయండి

అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు డీపీఓ నాగరాజ నాయుడు తెలిపారు. నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే ప్రజలు 9701745437 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. అందిన సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
News February 12, 2026
ఈ నెల 16న ఛైర్‌పర్సన్/మేయర్ ఎన్నిక

TG: 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఈ నెల 16న కలెక్టర్ల పర్యవేక్షణలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక జరగనుంది. రేపు కౌంటింగ్ జరగనుండగా గెలిచిన అభ్యర్థులు 16న ఉ.11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. మ.12.30 గంటలకు మెజార్టీ ఆధారంగా ఛైర్‌పర్సన్/మేయర్ ఎన్నిక, తర్వాత వైస్ ఛైర్‌పర్సన్/డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. ఈ ఎంపికలో ఎక్స్‌అఫీషియో(MPలు, ఎమ్మెల్యేలు, MLCలు) సభ్యుల ఓట్లూ కీలకం కానున్నాయి.
News February 12, 2026
ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారా?

ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా కామెంట్ చేయండి.


