News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 11, 2026
అసెంబ్లీ బయట జగన్‌తో కలిసి పెద్దిరెడ్డి నిరసన

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ముందుగా జగన్‌తో కలిసి అసెంబ్లీ బయట పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిరసన ర్యాలీ చేపట్టారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత అసెంబ్లీలోకి వెళ్లిన రామచంద్రారెడ్డి కాసేపటికే వాకౌట్ చేసి వచ్చేశారు.
News February 11, 2026
నిజామాబాద్ జిల్లాలో రెండు గంటల్లో 8.25 శాతం పోలింగ్

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో (ఉదయం 9 గంటల వరకు) ఓవరాల్ గా 8.25 శాతం పోలింగ్ నమోదైంది. NZB కార్పొరేషన్‌తో పాటు BDN, ARMR, BMGL మున్సిపాలిటీల పరిధిలోని 146 వార్డులకు సంబంధించి 729 పోలింగ్ స్టేషన్లలో 4,95,485 మంది ఓటర్లకు గాను 40,857 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.
News February 11, 2026
VZM: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

ఏపీలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. విజయనగరం జిల్లాలో మొత్తం 22,959 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారని DEO మాణిక్యం నాయుడు తెలిపారు. వీరి కోసం 119 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో టెన్త్ మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం కావడంతో అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. వివరాల్లో తప్పులు ఉంటే FEB-12 లోగా HMలను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు.


