News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 18, 2026
కోకో సాగులో కొత్త అధ్యాయం.. ఏలూరులో కాన్‌క్లేవ్(1/3)

జిల్లాలో కోకో సాగును చూసి మరింతగా సాగును, రైతులను ప్రోత్సహించాలని ఏలూరులో జనవరి30, 31తేదీల్లో కాన్‌క్లేవ్ నిర్వహించారు. దీని ద్వారా కోకో గింజలను మాత్రమే విక్రయాలు చేయడం కాకుండా ఆ గింజల ద్వారా బట్టర్, పౌడర్ ఇలా అనేక ఉత్పత్తులను తయారు చేసుకునే విధానాలను అధికారులు వివరించారు. కాన్‌క్లేవ్‌లో కేరళ, చెన్నై, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బహుళజాతి కంపెనీలు కోకో ఉత్పత్తుల ప్రాసెసింగ్ యంత్రాలను ప్రదర్శించారు.
News February 18, 2026
ATP: రేపటి నుంచి రంజాన్.. ఉపవాస వేళలు

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభంకానుంది. అనంతపురం జిల్లాలో రేపటి ఉపవాస వేళలు ఇలా ఉన్నాయి.
☞ గుత్తిలో….
★ సహర్: ఉ.5-5.21
★ ఇఫ్తార్: సా.6.29
★ ఉపవాస కాలం: మొదటి రోజు సుమారు 13 గంటల పాటు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది.
☞ నోట్: ప్రాంతాలను బట్టి వేళలు కొన్నినిమిషాలు మారొచ్చు.
News February 18, 2026
GWL: ప్రతిభ చాటిన విద్యార్థులకు కలెక్టర్ అభినందన

రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను గద్వాల కలెక్టర్ సంతోష్ బుధవారం ఐడిఓసి మందిరంలో అభినందించారు. హైదరాబాద్ దోమలగూడ గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఈనెల 17న సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో గద్వాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. విష్ణు అనే విద్యార్థి లాంగ్ జంప్ లో మొదటి స్థానం, షాట్ పుట్‌లో రెండో స్థానం సాధించాడు.


