News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 10, 2026
గుడ్డులోని పచ్చసొనతో కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

గుడ్డు పచ్చసొన (Yolk) తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలామంది ఎగ్ వైట్ మాత్రమే తింటారు. అయితే పచ్చసొనలో విటమిన్ A, E, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి కీలక పోషకాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మన శరీరంలోని 85% కొలెస్ట్రాల్‌ను కాలేయమే ఉత్పత్తి చేస్తుంది. ఆహారం ద్వారా వచ్చే కొలెస్ట్రాల్ ప్రభావం తక్కువే. పచ్చసొనలోని పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
News February 10, 2026
శ్రీశైలంలో మల్లన్న దర్శనానికి 4 గంటల సమయం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజు మంగళవారం శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం మ.12 గంటల సమయానికి 32,870 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 14,280 మంది కాలినడకన వచ్చారు. 12,931 మంది శివస్వాములు స్పర్శ దర్శనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రద్దీ కారణంగా దర్శనానికి 4 గంటల నుంచి సమయం పడుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
News February 10, 2026
BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ మేనేజర్, AVP ఫైనాన్స్& అకౌంట్స్, స్టేట్ హెడ్ రిటైల్ బ్రోకింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 28 వరకు careers@bobcaps.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి డిగ్రీ, PG/CA/MBA అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in


