News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 16, 2026

ADB: 25ఏళ్ల తర్వాత రెండో సారి

image

ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థి అనూష బండారి ప్రమాణ స్వీకారం చేశారు. 2001లో స్వతంత్ర అభ్యర్థిగా గొడుగు గుర్తుపై లాలా రాధేశ్యాం పోటీ చేసి గెలుపొంది మున్సిపల్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. సుమారు 25 ఏళ్ల తర్వాత మళ్లీ కుక్కర్ గుర్తుపై గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి అనూష ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

News February 16, 2026

బిల్ గేట్స్‌కు కలంకారీ వస్త్రాలను బహుకరించిన కలెక్టర్

image

రాష్ట్ర పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్‌కు గన్నవరం విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. కలెక్టర్ డీకే బాలాజీ బిల్ గేట్స్‌కు పెడన కలంకారీ వస్త్రాలను బహుకరించి స్వాగతం పలికారు. సహజమైన రంగులతో ముద్రించిన కలంకారీ వస్త్రాల విశిష్టత, దాని వెనుక దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని కలెక్టర్ ఆయనకు వివరించారు.

News February 16, 2026

అమలాపురం: పోలీసు పీజీఆర్ఎస్‌కు 31 ఫిర్యాదులు

image

అమలాపురంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో SP రాహుల్ మీనా ఆధ్వర్యంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 31 దరఖాస్తులు అందాయి. ఈ సమస్యలపై SP సంబంధిత అధికారులతో మాట్లాడి, చట్ట పరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.