News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 13, 2026

ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>ఎగ్జిమ్ <<>>బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in

News February 13, 2026

జటాజూటంలో నెలవంక ఎందుకయ్యా శివయ్యా?

image

శివుని జటాజూటంలోని నెలవంక మనస్సుపై నియంత్రణను సూచిస్తుంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. ఎప్పుడూ మారుతూ ఉంటాడు. అలాంటి చంద్రుడిని ధరించడమంటే చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని స్థితప్రజ్ఞత సాధించడమే. ఇది అమృతత్వానికి చిహ్నం. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మనస్సును శాంతంగా, ధీరత్వంతో ఉంచుకోవాలని గుర్తుచేస్తుంది. కాలక్రమంలో వచ్చే మార్పులను స్వీకరిస్తూనే, అంతర్గత శాంతిని కోల్పోకూడదని సందేశం!

News February 13, 2026

పత్తి తీత తర్వాత తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తలు

image

పత్తి తీత తర్వాత ఆ చేనులో గొర్రెలు, మేకలు, పశువులను మేపాలి. పత్తి మోళ్లను అందుబాటులో ఉండే ట్రాక్టరు రోటవేటరుతో భూమిలో కలియదున్నాలి. ఎండిన మొక్కల మోళ్లు, విచ్చుకోని కాయలను భూమిలో కలియదున్నడం వల్ల పంటకు హాని చేసే పురుగు కోశస్థ దశలను నాశనం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. పత్తి పంట పూర్తయిన తర్వాత ఆ భూమిలో నీటి వసతి ఉంటే రెండో పంటగా ఇతర ఆరుతడి పంటలను సాగు చేసుకోవచ్చు.