News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 17, 2026

ఖమ్మం: కలెక్టర్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు!

image

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం వివిధ శాఖల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీజతో కలిసి రబీ ధాన్యం సేకరణ ఏర్పాట్లు, వేసవిలో తాగునీటి ఎద్దడి కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోడ్ సేఫ్టీ పనులు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

News February 17, 2026

విజయవాడలో డ్రైన్స్ నిర్మాణంలో గందరగోళం!

image

VJA కార్పొరేషన్ పరిధిలో స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ నిర్మాణంలో గందరగోళం నెలకొంది. వీటి నిర్మాణానికి 2018లో కేంద్రం రూ.460 కోట్లను కేటాయించగా L&T సంస్థ పనులను చేపట్టింది. అప్పట్లో 59% పనులకు రూ.211 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 41% పనులకు రూ.600 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుత బడ్జెట్‌‌తో కొత్తగా డ్రైన్స్ నిర్మిస్తారా..? లేదా మిగిలిన పనులనే కొనసాగిస్తారా అన్నదానిపై చర్చలు సాగుతున్నాయి.

News February 17, 2026

NZB: ఉమ్మడి జిల్లాలో ప్రశాంతం

image

ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో మేయర్/ఛైర్మన్‌లతో పాటు డిప్యూటీ మేయర్/వైస్ ఛైర్మన్‌ల ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కూడా ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.