News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 15, 2026

వేములవాడ: కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ లు శనివారం రాత్రి సందర్శించారు. భక్తుల రాకపోకలు, క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా మహా జాతర విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.

News February 15, 2026

‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ రచయిత మృతి.. అనుమానాలు?

image

TG: యూట్యూబర్, రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న అతడు ప్రయాణిస్తున్న కారు ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలోకి దూసుకెళ్లింది. వెనుక భాగంలో కూర్చున్న శ్రీనివాస్ మరణించగా, డ్రైవర్ కారులో నుంచి కిందపడి అక్కడి నుంచి పరారైనట్లు మత్స్యకారులు తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనివాస్ గతంలో ‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అనే పుస్తకంతో చర్చనీయాంశంగా మారారు.

News February 15, 2026

వర్ధన్నపేట ఛైర్మన్ ఎంపిక ఆమె చేతిలోనే!

image

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పురపాలిక ఛైర్మన్ ఎంపిక ఆమె చేతుల్లోనే ఉంది. కాంగ్రెస్‌కు 5 స్థానాలు రాగా, బీఆర్ఎస్‌కు 6 స్థానాలు వచ్చాయి. ఎమ్మెల్యే ఓటుతో కాంగ్రెస్‌కు ఆరు స్థానాలు ఉండగా, స్వతంత్ర అభ్యర్థి శిబారాణి ఎటువైపు వెళ్తే అటే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికయ్యే స్పష్టత కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ క్యాంపులోనే శిబారాణి ఉన్నట్లుగా తెలుస్తుండగా, చివరి నిమిషంలో ఏం జరుగుతుందో ఉత్కంఠ నెలకొంది.