News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 10, 2026

అనకాపల్లి జాయింట్ కలెక్టర్‌గా సౌర్యమాన్ పటేల్

image

అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా సౌర్యమాన్ పటేల్ నియమితులయ్యారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్న పటేల్‌ను అనకాపల్లి జేసీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుకు తొలుత మల్లవరపు సూర్య తేజను నియమించినప్పటికీ, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన జాయిన్ కాలేదు. దీంతో సూర్య తేజను APటెక్నాలజీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News February 10, 2026

ఈనెల 20 వరకు సీసీఐ పత్తి కొనుగోళ్లు: అదనపు కలెక్టర్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైతులందరూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మంగళవారం తెలిపారు. 2025–26 సీజన్‌కు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ద్వారా జిల్లాలో పత్తి కొనుగోళ్లు కొనసాగుతున్నట్లు తెలిపారు. జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ఈనెల 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News February 10, 2026

ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం: MNCL కలెక్టర్

image

మున్సిపల్ పోలింగ్‌కు జిల్లాలోని 1 కార్పొరేషన్, 4 మున్సిపాలిటీలలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంచిర్యాల కార్పొరేషన్ 60 డివిజన్లకు 265 కేంద్రాలు, బెల్లంపల్లి 34 వార్డులకు 68 కేంద్రాలు, చెన్నూర్‌లో 18వార్డులకు 36 కేంద్రాలు, క్యాతన్‌పల్లిలో 22 వార్డులకు 45 కేంద్రాలు, లక్షెట్టిపేట 15 వార్డులకు 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.