News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 12, 2026

పోలవరం జిల్లాల్లో డీ వార్మింగ్ డేకు ఏర్పాట్లు

image

ఈనెల 17న డీ వార్మింగ్ డే సందర్భంగా జిల్లాలోని 29 ఆసుపత్రులు పరిధిలో 1-19 ఏళ్లలోపు 87,217 మందికి అన్ని PHCలకు మందులు పంపించామని జిల్లా వైద్యాధికారిణి డా.సరిత అన్నారు. 96 వేలు మాత్రలు వచ్చాయన్నారు. కుష్ఠు వ్యాధి అవగాహన పక్షోత్సవాలు గత నెల 31 నుంచి ఈనెల 13 తేదీ వరకు నిర్వహించినందులకు జిల్లాలో 800 మంది ఆశా వర్కర్స్‌కు ఒక్కొక్కరి రూ.1,050ల వంతున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు.

News February 12, 2026

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు: అనకాపల్లి ఎస్పీ

image

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. బుధవారం రాత్రి అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు.

News February 12, 2026

NLR: దొంగతనం నింద వేశారని విద్యార్థి సూసైడ్

image

నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది. టీపీగూడూరు(M) మండలం పేడూరు గమ్మళ్లపాలేనికి చెందిన యువకుడు(16) ఓ ప్రైవేట్ స్కూళ్లో 10వ తరగతి చదువుతున్నాడు. బుధవారం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఉరేసుకున్నాడు. అతను చదివే స్కూల్లో నగదు దొంగతనం జరిగిందని.. విద్యార్థే చోరీ చేశాడని టీచర్లు నిలదీశారంట. నింద భరించలేకే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థి బంధువులు ఆరోపిస్తున్నారు.