News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 16, 2026

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి పొనుగుపాటి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా పొనుగుపాటి శ్రీనివాస్ వరుసగా రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ తనను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారని శ్రీనివాస్ తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రెండోసారి తనకు అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

News February 16, 2026

చంద్రబాబువి విజనరీ ఆలోచనలు: బిల్ గేట్స్

image

AP: తాను కలిసిన ప్రపంచ నేతలతో పోలిస్తే చంద్రబాబువి విజనరీ ఆలోచనలని బిల్ గేట్స్ కితాబిచ్చారు. ‘ఈ విషయాన్ని CBNతో జరిగిన తొలి భేటీలోనే గ్రహించాను. ఆయన ITని ప్రమోట్ చేయడం వల్లే HYD నుంచి నిపుణులు తయారయ్యారు. డిజిటల్ విప్లవంలో మోదీ, CBN కీలకపాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులకు సరైన విద్యాబోధన చేయడానికి AI తోడ్పడుతుంది. వ్యవసాయంలో Ai వాడుక మంచి పరిణామం’ అని సెక్రటేరియట్‌లో జరిగిన సమావేశంలో తెలిపారు.

News February 16, 2026

TGలో మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ల ఎన్నిక UPDATES

image

* నిర్మల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య(INC), వైస్ ఛైర్మన్‌గా అప్పాల గణేశ్ చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ భార్యాభర్తలు.
* జగిత్యాల(D) మెట్‌పల్లి మున్సిపాలిటీ ఛైర్మన్‌గా లింబాద్రి(INC) ఎన్నికయ్యారు. 26 వార్డులకు గాను కాంగ్రెస్ కేవలం 6 సీట్లే గెలుచుకుంది. అయితే పలువురు ఇండిపెండెంట్లు, ఒక బీజేపీ సభ్యుడి మద్దతుతో ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.