News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 17, 2026
శోభాయమానంగా ఏడుపాయల రథోత్సవం

ఏడుపాయల వనదుర్గా భవాని క్షేత్రంలో రథోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. రథాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించి, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అదనపు ఎస్పీ మహేందర్ పర్యవేక్షణలో ఊరేగింపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో క్షేత్రమంతా సందడిగా మారింది. భక్తుల జయజయధ్వానాల మధ్య అమ్మవారి కీర్తి ఎల్లలు దాటిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News February 17, 2026
పాకిస్థాన్‌కు ‘రావి’ షాక్: ఏప్రిల్ నుంచి నీళ్లు బంద్!

వేసవి వేళ పాక్‌కు భారత్ షాకివ్వనుంది. రావి నదిపై నిర్మిస్తున్న షాపూర్ కండి బ్యారేజ్ మార్చి 31 నాటికి పూర్తి కానుంది. దీంతో ఏప్రిల్ నుంచి పాక్‌కు వెళ్లే మిగులు జలాలను పూర్తిగా నిలిపేయనున్నట్లు JK మంత్రి జావెద్ అహ్మద్ ప్రకటించారు. 1960 ఒప్పందం ప్రకారం ఈ నదిపై భారత్‌కే పూర్తి హక్కులు ఉన్నా ఇన్నాళ్లూ ప్రాజెక్టుల్లేక నీరు వృథాగా పాక్‌కు వెళ్లేది. ఇకపై ఆ నీటితో JK, పంజాబ్‌లకు సాగునీరు అందనుంది.
News February 17, 2026
సంగారెడ్డి: ఈనెల 21న పాఠశాలల్లో పీటీఎం సమావేశం

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 21న తప్పనిసరిగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని డిఇఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతం, పాఠశాలల అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చించాలని సూచించారు. చర్చించిన అంశాలను వెంటనే మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు తల్లిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు.


