News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 13, 2026

మంచిర్యాల కార్పొరేషన్‌లో కాంగ్రెస్ విజయం

image

TG: మంచిర్యాల కార్పొరేషన్‌‌ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 60 డివిజన్లలో 45 స్థానాలను సొంతం చేసుకుంది. BRS 5, BJP ఒక డివిజన్‌లో గెలుపొందాయి. అటు నల్గొండ, మహబూబ్‌నగర్, రామగుండంలోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కరీంనగర్, నిజామాబాద్‌లో బీజేపీ లీడ్‌లో ఉంది. BRS ఒక్క కార్పొరేషన్‌లోనూ సత్తా చాటలేకపోతోంది.

News February 13, 2026

కార్మిక సంక్షేమశాఖ ఆదాయం, ఈ-శ్రమ అమలు తీరుపై సమీక్ష

image

కార్మిక సంక్షేమశాఖకు వచ్చిన పన్నుల వసూళ్లు, ఈ-శ్రమ పోర్టల్ అమలు తీరుపై బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. శాఖకు సంబంధించిన ఆదాయ వనరులు, పెండింగ్ వసూళ్లు, ఈ-శ్రమ పోర్టల్‌లో కార్మికుల నమోదు పురోగతి, అమలు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు.

News February 13, 2026

తూప్రాన్: సమంగా ఓట్లు.. డ్రా

image

తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ మరో విజయం నమోదైంది. మున్సిపాలిటీలోని 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సత్య లింగం, స్వతంత్ర అభ్యర్థి కృష్ణ పై గెలుపొందారు. ఇరువురికి సమంగా 330 ఓట్లు రాగా, డ్రా నిర్వహించారు. డ్రాలో సత్య లింగం గెలుపొందారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. లెక్కింపు కేంద్రం వద్ద గులాబీ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు.