News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 18, 2026

ఈ అలవాట్లతో బరువు తగ్గొచ్చు

image

కండరాల నిర్మాణం, బలం కోసం ప్రోటీన్ ఉన్న ఆహారం తినాలి. ముఖ్యంగా చికెన్, సీ ఫుడ్, ఎగ్స్, సోయా, నట్స్, సీడ్స్ వంటి లీన్ ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. మటన్ వంటి మాంసాహారం తగ్గించాలి. దీంతో బరువు అదుపులో ఉంటుంది. క్యారెట్లు, ముల్లంగి, బీట్రూట్, మెంతికూర, పాలకూర ఎక్కువగా తింటే పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు కరుగుతుంది. సీజనల్ ఫ్రూట్స్, తగినంత నీరు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News February 18, 2026

జగిత్యాల: ఉరి వేసుకొని మైనర్ బాలిక ఆత్మహత్య

image

పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన మైనర్ బాలిక మంగళవారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై కిరణ్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం.. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలిక అనారోగ్యంతో బాధపడుతూ 15 రోజుల క్రితం ఇంటికి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స అందించగా, వ్యాధి న్యాయం కాకపోవడంతో నొప్పి భరించలేక బాలిక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

News February 18, 2026

ఎLAW: చిల్లుపై బిల్లుతో పోరాడవచ్చు

image

హోటళ్లలో ఫుడ్ తిన్నాక అస్వస్థతకు గురైతే ఆ మేనేజ్మెంట్‌ను తిట్టుకుని, డాక్టర్‌ను కలిసి మెడిసిన్ వేసుకుని సరిపెట్టుకుంటాం. కానీ మనకు జరిగిన శారీరక, ఆర్థిక, మానసిక నష్టానికి పరిహారం పొంది చట్టపర చర్యలతో మరోసారి, మరొకరికి ఇలా జరగకుండా చూడొచ్చు. దీనికి కావాల్సింది మీ ఫుడ్ బిల్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్. వీటితో ఫుడ్ సేఫ్టీ అథారిటీలో లేదా కోర్టులో కేసు వేయొచ్చు. కాబట్టి డబ్బు చెల్లించగానే బిల్ పడేయకండి.