News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 16, 2026

MBNR: మహిళలకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల ఆహ్వానం

image

మహబూబ్ నగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జె.జయప్రద ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. 2026-27 సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, రిజర్వేషన్ & మెరిట్ ఆధారితంగా సీట్లు కేటాయిస్తామని, ఈ అవకాశాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
SHARE IT

News February 16, 2026

శాఖల సమన్వయం.. ప్రశాంతంగా మహాశివరాత్రి తిరునాళ్లు

image

శివరాత్రి సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని శివాలయాలు భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. లక్షలాది మంది భక్తులు దర్శనానికి తరలివచ్చినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఎండోమెంట్స్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆరోగ్యశాఖ, RTC అధికారుల ప్రణాళికలు, సమన్వయంతో తిరునాళ్లు విజయవంతమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలు ఫలించి వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు వెల్లడించారు.

News February 16, 2026

నెల్లూరు జిల్లా ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

నెల్లూరు జిల్లాలోని అన్ని శాఖల్లో అర్హత కలిగిన వారందరికీ రానున్న నెల రోజుల్లో ప్రమోషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. పానల్ జాబితాలను తయారు చేయాలని సూచించారు. కొన్ని శాఖల్లో ఎప్పటినుంచో సర్వీస్‌లో ఉంటూ ప్రమోషన్ పొందని వారు ఇంకా ఉన్నారని చెప్పారు. క్రిమినల్, శాఖా పరమైన కేసులు లేని వారందరికీ ప్రమోషన్ ఇవ్వాలని సూచించారు.