News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 10, 2026
బౌరాపూర్ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

అమ్రాబాద్ భ్రమరాంబ దేవత పేరుమీదుగా ఈ గ్రామానికి బౌరాపూర్ అనే పేరు వచ్చింది. ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. చెంచులు భ్రమరాంబను తమ ఆడబిడ్డగా, మల్లన్నను అల్లుడిగా భావిస్తూ శివరాత్రికి బౌరాపూర్‌లో ‘చెంచుల పండుగ’ పేరుతో పెద్ద జాతర నిర్వహిస్తారు. పూర్వం రోజులలో నల్లమల అడవుల గుండా శ్రీశైలంకు వెళ్లే దారిలో నీటి వనరు ఉన్న ఏకైక క్షేత్రమిది.
News February 10, 2026
NTR: ఘోర ప్రమాదం.. హృదయ విదారక ఫొటో

పెనుగంచిప్రోలు మండలం కొనకంచి వద్ద VJA-HYD హైవేపై మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న దంపతులను వెనక నుంచి ఓ ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యతో పాటు చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. భార్య చేయి ఎముకలు విరిగిపోయి దారుణంగా ఉంది. వెంటనే క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 10, 2026
ఈనెల 12న ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 12న సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం దేశవ్యాప్త కార్మికుల సమ్మె సందర్భంగా మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు వివరించారు. 13న (శుక్రవారం) మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరుగుతాయని, 14, 15న (శని, ఆదివారాలు) వారంతపు సెలవులు ఉంటాయని వెల్లడించారు. రైతులు గమనించి సహకరించాలని కోరారు.


