News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 16, 2026

తిరుపతి: LRS గడువు ఎప్పటివరకు పొడిగించారో తెలుసా…!

image

అనాధికారిక భవన నిర్మాణాలకు సంబంధించి LRS దరఖాస్తుల గడువు ఏప్రిల్ 23 వరకు పొడిగించారు. ఇప్పటివరకు 968 దరఖాస్తులు రాగా 135 పూర్తి అయ్యాయి. ఇక BPS కి సంబంధించి 1000 నోటీసులు తిరుపతి కార్పొరేషన్ ఇవ్వగా 1322 దరఖాస్తులు వచ్చాయి.. 262 పూర్తి చేశారు. సుమారు 2500 వరకు దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ మౌర్య కోరారు.

News February 16, 2026

అమరావతి: సచివాలయంలో సీఎంతో బిల్ గేట్స్ భేటీ

image

వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ చేరుకున్నారు. గేట్స్ బృందానికి మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు బిల్ గేట్స్‌కు మంత్రులను పరిచయం చేశారు. అనంతరం ఆయన రియల్ టైం గవర్నెన్స్‌ను పరిశీలిస్తున్నారు.

News February 16, 2026

రూ.75వేల జీతంతో AERAలో ఉద్యోగాలు

image

ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(AERA)లో 3డేటా అనలిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ( స్టాటిస్టిక్స్) అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.75,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://aera.gov.in