News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 10, 2026

బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయి: కేంద్రం

image

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు తమ పరిశీలనలో ఉన్నాయని కేంద్రం తెలిపింది. విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచడంపై BJP ఎంపీ ఈటల రాజేందర్ లోక్‌సభలో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి బీఎల్ శర్మ పైవిధంగా సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ కార్యదర్శి నుంచి 2 బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం వచ్చాయని వివరించారు.

News February 10, 2026

జనగాం: ఇంటర్ ప్రయోగ పరీక్షలకు 19 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో ప్రయోగ పరీక్షలు 9వ రోజు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.జితేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 6 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా, ఉదయం జనరల్ 270 మందికి 269 మంది, ఒకేషనల్ 120 మందికి 107 మంది హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జనరల్ 260 మందికి 257 మంది, ఒకేషనల్ 40 మందికి 38 మంది పరీక్షలు రాశారని తెలిపారు.

News February 10, 2026

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పొందిన ‘నన్నయ్య’

image

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వందేమాతరం 150 ఏళ్ళ వేడుకల్లో 21,000 మంది విద్యార్థులు, సిబ్బందిచే జాతీయ గేయం వందేమాతరాన్ని ఆలపించారు. ఈ క్రమంలో దేశభక్తి, ఐక్యతకు చిహ్నంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ ఆఫ్ నేషనల్ రికార్డు ప్రదానం చేశారు. మంగళవారం వర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆ సంస్థ ప్రతినిధులు సర్టిఫికెట్ అందజేశారు.