News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 10, 2026
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పలు పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో డిసెంబర్ 2025లో నిర్వహించిన ఎంపీఈడీ/డీపీఈడీ 3వ సెమిస్టర్ పరీక్షలు ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ANU అధికారిక వెబ్‌సైట్ https://nagarjunauniversity.ac.in/examcell/results ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
News February 10, 2026
కరప: ఇంటిలో చోరీకి పాల్పడి దొరికిపోయిన బాలుడు

కరప మెరకవీధిలోని ఓ ఇంటిలో సోమవారం సాయంత్రం దొంగ తనానికి వెళ్లి ఓ బాలుడు దొరికిపోయాడు. స్థానికుల సమాచారంతో ఏఎస్ఐ సూరిబాబు అతడిని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. తాము నలుగురం కలిసి తిరుగుతున్నామని ఆ బాలుడు తెలిపాడు. మిగిలిన వారి కోసం గాలించగా వారు ఆచూకీ లభ్యం కాలేదు. కాగా సోమవారం రాత్రి నలుగురు ఇళ్ల తలుపులు కొట్టిన నేపథ్యంలో జనాల్లో భయం ఏర్పడింది.
News February 10, 2026
వంట చేస్తూ మాట్లాడుతున్నారా?

వంట చేయడం ధ్యానం వంటిది. ఇది ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. అందుకే ఆహారం వండేటప్పుడు మౌనంగా ఉండటం చాలా ఉత్తమం. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. టీవీ చూస్తూనో, ఫోన్ మాట్లాడుతూనో వంట చేస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది. మౌనంగా చేస్తే వంటకాలు మరింత రుచికరంగా తయారవుతాయని నమ్మకం. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రశాంతంగా, ఏకాగ్రతతో వంట చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


