News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 17, 2026
కాంగ్రెస్‌కు సత్తా లేదు.. బీజేపీతో కుమ్మక్కు: హరీశ్ రావు

కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగా BRSను ఎదుర్కొనే సత్తా లేదని, అందుకే సిగ్గు వదిలేసి బీజేపీతో కుమ్మక్కు అయిందని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఈరోజు మున్సిపల్ ఫలితాలతో మరోసారి స్పష్టమైందని ధ్వజమెత్తారు. రెండు జాతీయ పార్టీలు ఒకటై బీఆర్ఎస్ మీద దాడి చేస్తున్నాయని, ఆ పార్టీల చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
News February 17, 2026
సిద్దిపేట: మహిళలకే అందలం.. కొత్త ఛైర్‌పర్సన్‌లు వీరే

సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాల్ ఛైర్‌పర్సన్ పదవులు మహిళలకు రిజర్వు అయ్యాయి. దీంతో కీలకమైన ఆ పదవిలో నలుగురు మహిళా మణులు బాధ్యతలు స్వీకరించారు. చేర్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ముస్త్యాల అరుణ, దుబ్బాక- శ్రీరామ్ సంగీత, గజ్వేల్-గంగిశెట్టి చందన, హుస్నాబాద్- దండి లక్ష్మిలు పదవి చేపట్టారు.
News February 17, 2026
డబ్బులే డబ్బుల్.. దేశంలో భారీగా క్యాష్ ట్రాన్సాక్షన్స్

దేశంలో డిజిటల్ పేమెంట్స్ జోరు కొనసాగుతున్నా ఇంకా నగదు చలామణి భారీగా ఉందని SBI లేటెస్ట్ రిపోర్ట్ తెలిపింది. JANలో రూ.40లక్షల కోట్లు చేతులు మారినట్లు పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఇది 11.1% ఎక్కువ. నగదు చలామణిలో 97.6% ప్రజల వద్దే నోట్ల రూపంలో ఉంది. నెలకు రూ.40లక్షల కంటే ఎక్కువ UPI లావాదేవీలు జరిపితే GST నోటీసులు, ఇన్‌కమ్ ట్యాక్స్ భయాలతో నగదు బదిలీ పెరిగినట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.


