News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
నీళ్లపై చర్చలకు మేము సిద్ధం: చంద్రబాబు

AP: నీటి సమస్యపై 2 తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలని CM CBN స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను AP అడ్డుకుంటోందన్న TG CM రేవంత్ వ్యాఖ్యలపై అసెంబ్లీలో చంద్రబాబు స్పందించారు. ‘APలోని నల్లమల సాగర్‌ను TG అడ్డుకోవడం సరికాదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేం సపోర్ట్ చేశాం. 5000 TMCల గోదావరి నీరు వృథాగా పోతోంది. కృష్ణాలోనూ నీటి వృథా ఉంది. సమస్యలపై చర్చకు మేము సిద్ధం’ అని పేర్కొన్నారు.
News February 13, 2026
గద్వాల్: 4 సార్లు రీకౌంటింగ్.. ఆ తర్వాత ఆమెనే గెలిచింది

గద్వాల్ మున్సిపాలిటీ 8వ వార్డు ఎన్నికల కౌంటింగ్ హై-వోల్టేజ్ డ్రామాను తలపించింది. క్షణక్షణానికి ఫలితం మారుతూ అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసింది. 4సార్లు లెక్కించిన తర్వాతే అధికారులు విజేతను ధ్రువీకరించారు. కేవలం ఒక్క ఓటుతో గెలవడం గద్వాల మున్సిపల్ చరిత్రలో చర్చనీయాంశంగా మారింది. సమీప అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మ ఒక్క ఓటు తేడాతో విజయం సాధించటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సవం నెలకొంది.
News February 13, 2026
BREAKING: కామారెడ్డిలో హంగ్.. కింగ్ మేకర్ BRS

కామారెడ్డి మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. మున్సిపాలిటీలోని మొత్తం 49 వార్డుల్లో కాంగ్రెస్ 19, బీజేపీ 16, బీఆర్ఎస్ 11, ఇండిపెండెంట్ 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. మ్యాజిక్ ఫిగర్ 25 సంఖ్య ఏ పార్టీకి రాలేదు. దీంతో 11 స్థానాలను దక్కించుకున్న బీఆర్ఎస్ కింగ్ మేకర్‌గా మారనుంది. వారు మద్దతు ఇస్తేనే ఛైర్మన్ ఎన్నికకు అవకాశాలు ఉన్నాయి.


